📄 ePaper
Epaper 2
Wednesday, October 21, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపోలీసుల త్యాగాలు, సేవలు చిరస్మరణీయం

పోలీసుల త్యాగాలు, సేవలు చిరస్మరణీయం

📰 Generate e-Paper Clip

పోలీసుల త్యాగాలు, సేవలు చిరస్మరణీయం…!

జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

పోలీసుల త్యాగాలు, సేవలు చిరస్మరణీయమని, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు భరోసా, రక్షణ కల్పించడంలో పోలీసుల పాత్ర ఎంతో కీలకమని జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్ అన్నారు.

బుధవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (పోలీస్ ఫ్లాగ్ డే) సందర్భంగా ఖమ్మం పోలీస్ హెడ్ క్వార్టర్స్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన స్మృతి పరేడ్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్, ఖమ్మం పోలీస్ కమీషనర్ సునీల్ దత్‌తో కలిసి పాల్గొన్నారు.

పరేడ్ గ్రౌండ్స్‌లోని పోలీస్ అమరవీరుల స్మారక స్థూపం వద్ద కలెక్టర్, పోలీస్ కమీషనర్, పోలీస్ అధికారులు, సిబ్బంది, పోలీస్ కుటుంబ సభ్యులు పుష్పాంజలి ఘటించి అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరులను స్మరించుకుని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.

జిల్లాకలెక్టర్ దివాకర టి ఎస్ మాట్లాడుతూ దేశ రక్షణ కోసం లడక్ సరిహద్దు ప్రాంతంలో ప్రాణ త్యాగం చేసిన వీరుల స్ఫూర్తిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పోలీస్ జెండా కేవలం ఒక వస్త్రం కాదని, అది పోలీస్ శాఖ నిత్యం ప్రదర్శించే నిబద్ధత, త్యాగం, గౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో ప్రగతికి తోడుగా ప్రజలకు భరోసా, రక్షణ కల్పిస్తూ శాంతి భద్రతలను కాపాడటంలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.
ప్రల భద్రతకు భరోసా కల్పిస్తూ పోలీసులు నిరంతరం విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. పోలీసులు సమర్థవంతంగా విధులు నిర్వహించేందుకు వారి కుటుంబ సభ్యుల సహకారం కూడా ఎంతో అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు. విధి నిర్వహణలో పోలీసులకు అండగా నిలుస్తున్న కుటుంబ సభ్యుల త్యాగాలను కూడా ఈ సందర్భంగా స్మరించుకోవాలని తెలిపారు.
ప్రస్తుతం నేరాల స్వరూపం వేగంగా మారుతోందని, సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు సహా కొత్త తరహా నేరాలు వెలుగు లోకి వస్తున్న నేపథ్యంలో వాటిని సమర్థవంతంగా అరికట్టేందుకు పోలీసింగ్ విధానాలను ఆధునీకరిస్తూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసింగ్‌లో వినియోగించడంలో తెలంగాణ పోలీస్ శాఖ దేశంలో ముందంజలో ఉందని పేర్కొన్నారు.

ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమం సాధనలో పోలీస్ శాఖ, జిల్లా యంత్రాంగం రెండు ముఖ్యమైన విభాగాలని, పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ అన్నారు.
పోలీస్ కమీషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ 1959 అక్టోబర్ 21న లడఖ్‌ ప్రాంతంలో చైనా సైనికులతో పోరాడుతూ దేశ సరిహద్దులను కాపాడే క్రమంలో 10 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రాణత్యాగం చేశారని తెలిపారు. చివరి శ్వాస వరకు దేశ రక్షణ కోసం పోరాడిన వారి త్యాగాలకు గుర్తుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు సిబ్బంది త్యాగాలను ఈ సందర్భంగా స్మరించు కుంటున్నామని తెలిపారు. శాంతిభద్రతలను కాపాడటం, ప్రజలకు రక్షణ కల్పించడం, నేరాలను నియంత్రించడం వంటి బాధ్యతలను పోలీసులు నిరంతరం నిర్వర్తిస్తున్నారని అన్నారు.
అనంతరం పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులను జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్, పోలీస్ కమీషనర్ సునీల్ దత్ లు శాలువాలతో సత్కరించి గౌరవించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రామానుజం, ఏ ఆర్ డిసిపిలు కుమారస్వామి, విజయబాబు, ఏ ఆర్ ఏసీపీలు సుశీల్ సింగ్, నర్సయ్య, ఏసీపీలు రమణమూర్తి, మహేష్, సాంబరాజు, నర్సింహారావు సిఐలు, ఆర్ఐలు, పోలీసు అధికారులు, సిబ్బంది, పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.