శ్రీ దుర్గామాత నిమజ్జన పూజలో పాల్గొన్న మాజీ ఎంపీటీసీ హేమలత సతీష్ దంపతులు
దండేపల్లి, అక్టోబర్ 21 (ప్రజావాణి):
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట గ్రామంలో ప్రతిష్ఠించిన శ్రీ దుర్గామాతకు నవరాత్రుల సందర్భంగా భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నవరాత్రులు ముగిసిన సందర్భంగా బుధవారం అమ్మవారికి అభిషేకం చేసి, నిమజ్జన పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తాళ్లపేట గ్రామ మాజీ ఎంపీటీసీ హేమలత సతీష్ దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా తాళ్లపేట గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, గ్రామం పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని, శ్రీ దుర్గామాత ఆశీస్సులు గ్రామస్తులందరిపై ఎల్లప్పుడూ ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు వారు తెలిపారు.
అమ్మవారి కృపతో గ్రామంలో శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

