📄 ePaper
Epaper 2
Sunday, October 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణజర్నలిస్టులపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలి

జర్నలిస్టులపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలి

📰 Generate e-Paper Clip

జర్నలిస్టులపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలి

* బాధ్యులపై చట్టపరమైన చర్యలుతీసుకోవాలిజర్నలిస్టులకు రక్షణ కల్పించాలి

* ఎస్‌ఐతో పాటు బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలి

* టిడబ్ల్యూజేఎఫ్‌ జిల్లా కార్యదర్శి కుడుతాడి బాపురావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు గాదె కరుణాకర్‌రావు డిమాండ్‌

జమ్మికుంట అక్టోబర్ 16(ప్రజావాణి)

వార్తా కథనాలు ప్రచురించిన జర్నలిస్టులను అదుపులోకి తీసుకుని థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారన్న ఆరోపణలపై సమగ్ర, నిష్పక్షపాత విచారణ జరిపించాలని తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ (టిడబ్ల్యూజేఎఫ్‌) కరీంనగర్‌ జిల్లా కార్యదర్శి కుడుతాడి బాపురావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు గాదె కరుణాకర్‌రావు డిమాండ్‌ చేశారుగంభీరావుపేట ఎస్‌ఐ శ్రీకాంత్‌తో పాటు ఈ ఘటనకు బాధ్యులైన పోలీసులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారుశుక్రవారం కరీంనగర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్టులు సంపత్‌, ఎడిటర్‌ శేఖర్‌లను టిడబ్ల్యూజేఎఫ్‌ నాయకులు పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడంతో పాటు ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు బాధిత జర్నలిస్టులకు న్యాయం జరిగేలా తమ వంతు కృషి చేస్తామనిభరోసాఇచ్చారువార్తలు రాస్తే ప్రతీకార చర్యలాఈ సందర్భంగా కుడుతాడి బాపురావు మాట్లాడుతూ గంభీరావుపేట ఎస్‌ఐ శ్రీకాంత్‌ వ్యవహారశైలిపై వరుస కథనాలు ప్రచురించినందుకే జర్నలిస్టులపై ప్రతీకార చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడం ఆందోళనకరమన్నారుప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి, అధికారుల పనితీరును ప్రశ్నించడం జర్నలిస్టుల వృత్తిలో భాగమని పేర్కొన్నారుజర్నలిస్టులపై దాడులకు పాల్పడటం పోలీసుల అదుపులో చిత్రహింసలకు గురిచేశారనే ఆరోపణలు రావడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు. ఈ ఘటనపై సిరిసిల్ల జిల్లా పోలీసు ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి వాస్తవాలను వెలికితీసేలా విచారణచేపట్టాలనికోరారుస్వతంత్రవిచారణజరిపించాలిపోలీసుల అదుపులో ఉన్న సమయంలో జర్నలిస్టుల మొబైల్‌ ఫోన్లు తీసుకోవడంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఆలస్యంగా అందిందని బాధితులు తెలిపినట్లు నాయకులు పేర్కొన్నారు జర్నలిస్టులను ఎక్కడికి తీసుకెళ్లారుఎక్కడెక్కడ దాడులు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి ఈ ఘటనలో ఎవరెవరి పాత్ర ఉంది ఎవరి ఆదేశాలతో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి అనే అంశాలపై స్వతంత్రంగా విచారణ జరపాలని బాపురావు గాదె కరుణాకర్‌రావు డిమాండ్‌ చేశారుబాధ్యులపై చట్టపరమైన చర్యలుతీసుకోవాలిజర్నలిస్టులకు రక్షణ కల్పించాల్సిన వ్యవస్థలో ఇలాంటి ఘటనలకు సంబంధించిన ఆరోపణలు రావడం విచారకరమని నాయకులు అన్నారు. ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపి ఆరోపణలు నిజమని తేలితే గంభీరావుపేట ఎస్‌ఐ శ్రీకాంత్‌తో పాటు బాధ్యులైన పోలీసులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారుబాధిత జర్నలిస్టులకు న్యాయం జరిగేలా జిల్లా పోలీసు ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంలో న్యాయం జరగకపోతే జర్నలిస్టులకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారుఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్‌ నాయకులు నరేష్‌, శంకర్‌, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.