జమ్మికుంటలోషాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి డీజే పాటలతో చుట్టూ పక్కల ప్రజలను ఇబ్బంది పెట్టిన గరుడ వస్త్రసిల్క్
* జమ్మికుంటలో ఉదయం నుంచి రాత్రి వరకు డీజే హోరుపక్కనే ఆసుపత్రి చుట్టూ హాస్పిటళ్లు రోగులు గర్భిణీ మహిళలకు ఇబ్బందులు
జమ్మికుంట అక్టోబర్ 16 (ప్రజావాణి)
జమ్మికుంటలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా ఉదయం నుంచి రాత్రి వరకు డీజే పాటలు పెద్ద శబ్దంతో వినిపించడంతో స్థానికులు ఇబ్బందులుఎదుర్కొంటున్నారని తెలుస్తోంది షాపింగ్ మాల్కు పక్కనే ఒక ఆసుపత్రి ఉండగా చుట్టుపక్కల కూడా పలు ఆసుపత్రులు ఉన్నాయి దీంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులు గర్భిణీ మహిళలు ఇతర రోగులకు డీజే శబ్దాల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ప్రారంభోత్సవ వేడుకల సందర్భంగా రోడ్డును బ్లాక్ చేయడంతో వాహనదారులు పాదచారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారువేడుకలు నిర్వహించడంలో తప్పులేదని
అయితే ఆసుపత్రుల పరిసరాల్లో శబ్ద నియంత్రణ పాటిస్తూ ప్రజల రాకపోకలకు ఆటంకం కలగకుండా చూడాల్సిన బాధ్యత నిర్వాహకులపై ఉందని స్థానికులుఅభిప్రాయపడుతున్నారు సంబంధిత అధికారులు స్పందించి డీజే శబ్దాలు రోడ్డు బ్లాక్ అంశాలపై పరిశీలించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.వార్తలు చదవండి

