📄 ePaper
Epaper 2
Tuesday, October 13, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఉరవకొండ అభివృద్ధి నివేదికను సీఎంకు అందజేసిన మంత్రి పయ్యావుల

ఉరవకొండ అభివృద్ధి నివేదికను సీఎంకు అందజేసిన మంత్రి పయ్యావుల

📰 Generate e-Paper Clip

ఉరవకొండ అభివృద్ధి నివేదికను సీఎంకు అందజేసిన మంత్రి పయ్యావుల

అనంతపురం అక్టోబర్ 11 ప్రజావాణి ప్రతినిధి నియోజకవర్గంలో రెండేళ్ల అభివృద్ధి ప్రస్థానాన్ని వివరించిన ఆర్థిక మంత్రి
ఉరవకొండ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని వివరిస్తూ రూపొందించిన ప్రత్యేక పుస్తకాన్ని రాష్ట్ర ఆర్థిక మంత్రి, ఉరవకొండ ఎమ్మెల్యే శ్రీ పయ్యావుల కేశవ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కి అందజేశారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఉరవకొండ నియోజకవర్గంలో వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు చేకూరిన ప్రయోజనాలను సమగ్రంగా పొందుపరుస్తూ ఈ పుస్తకాన్ని రూపొందించినట్లు మంత్రి వివరించారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన ప్రగతి నివేదికగా, ప్రోగ్రెస్ కార్డుగా ఈ పుస్తకం ఉపయోగపడుతుందని తెలిపారు.ఉరవకొండకు తాగునీటి సదుపాయం, హంద్రీ-నీవా కాలువ వెడల్పుతో రైతులకు కలిగిన ప్రయోజనాలు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, గ్రామాల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణం, నూతన ప్రభుత్వ భవనాల మంజూరు సహా వివిధ రంగాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ఇందులో పొందుపరిచినట్లు ముఖ్యమంత్రికి వివరించారు.అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు, వాటి పురోగతి, ప్రజలకు చేకూరుతున్న ప్రయోజనాలను కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసానికి, కూటమి ప్రభుత్వంలో కొనసాగుతున్న అభివృద్ధి, వికాసానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలకు స్పష్టంగా తెలియజేసేలా ఎమ్మెల్యేలు ఈ తరహా అభివృద్ధి నివేదికలు, ప్రోగ్రెస్ కార్డులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని అభిప్రాయపడ్డారు.నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ వివిధ అభివృద్ధి పనులు, సాగునీటి లిఫ్ట్ ప్రాజెక్టుల మంజూరుకు సహకరిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.