📄 ePaper
Epaper 2
Saturday, October 10, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్దసరా సెలవులను ఆనందంగా గడపండి.. ప్రమాదాలకు దూరంగా ఉండండి

దసరా సెలవులను ఆనందంగా గడపండి.. ప్రమాదాలకు దూరంగా ఉండండి

📰 Generate e-Paper Clip

దసరా సెలవులను ఆనందంగా గడపండి.. ప్రమాదాలకు దూరంగా ఉండండి

ప్రజావాణి దినపత్రిక ప్రకాశం జిల్లా బ్యూరో (అక్టోబర్) 10 దొనకొండ.


దసరా సెలవుల్లో ప్రమాదకర ప్రాంతాలకు బావుల వద్దకు చెరువులకు వెళ్లి ప్రమాదాలను కొనితెచ్చుకోవద్దు.

దొనకొండ గ్రామీణ ప్రాంతాల వారికి ఎస్సై  ఎల్ రామకృష్ణ సూచన.

దొనకొండ:-దసరా సెలవులను విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆనందంగా గడపాలని దొనకొండ మండలంలో గ్రామీణ ఎస్సై రామకృష్ణ సూచించారు. సెలవుల సమయంలో పిల్లలు సరదాగా గడిపే క్రమంలో అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదాలకు గురికాకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.

దసరా సెలవుల్లో విద్యార్థులు  పలు ప్రాంతాలలొన్ని  సందర్శించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్సై హితవు పలికారు.
ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లడం, భద్రతా నియమాలను నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందన్నారు. పర్యాటక ప్రాంతాలను సందర్శించేటప్పుడు పెద్దల పర్యవేక్షణలోనే వెళ్లాలని సూచించారు.

తల్లిదండ్రులకు విజ్ఞప్తి


పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరితో వెళ్తున్నారు? అనే విషయాలపై తల్లిదండ్రులు నిరంతరం దృష్టి సారించాలని తెలిపారు. సెలవుల సమయంలో విద్యార్థుల భద్రతే ముఖ్యమని, చిన్నపాటి నిర్లక్ష్యం కూడా తీవ్ర ప్రమాదాలకు దారితీయవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు పోలీసుల సూచనలు పాటిస్తూ దసరా సెలవులను సురక్షితంగా, సంతోషంగా గడపాలని గ్రామీణ ఎస్సై ఎల్ రామకృష్ణ కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.