కృష్ణవేణి స్కూల్లో బతుకమ్మ సంబరాలు
ప్రజావాణి అక్టోబర్ 9 కమలాపూర్ మండల్ తెలంగాణ సాంస్కృతి సంప్రదాయాలకు అతీతంగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు
ఈ సందర్భంగా చిన్నారులు రంగురంగుల పూలతో బతుకమ్మ పేర్చి కోలాట నృత్యాలతో బతుకమ్మ పాటలతో ఆటపాటలతో బతుకమ్మ సంబరాల్లో పాల్గొని సాంస్కృతి సంప్రదాయాలను ఘనంగా అలరించారు
ఈ సందర్భంగా కృష్ణవేణి స్కూల్ ప్రధానోపాధ్యాయుడు చల్లూరి ప్రభాకర్ మాట్లాడుతూ పిల్లలకు ఆటపాటలతో పాటు తెలంగాణ సాంస్కృతిని సంప్రదాయాలను నేటి తరానికి తెలియజేయడంతో పాటు విద్యార్థులు తమ సంస్కృతిని సంప్రదాయాలను గౌరవిస్తూ వాటిని భవిష్యత్ తరాలకు అందించాలని సూచించారు

