అతివేగానికి అడ్డుకట్ట.. ఎస్పీ అదేశాలతో తనిఖీలు ముమ్మరం
.నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు.
.పస్రా మెయిన్ రోడ్డులో వాహన తనిఖీలు.. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్.
.పస్రా ఎస్సై తాజుద్దీన్.
*ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)*:-
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో ఇసుక లారీల ఇష్టారాజ్యానికి పోలీసులు అడ్డుకట్ట వేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పస్రా ఎస్సై తాజుద్దీన్ ఆధ్వర్యంలో శుక్రవారం ముమ్మర తనిఖీలు చేపట్టారు.
పస్రా మెయిన్ రోడ్డు, ములుగు-ఏటూరునాగారం ప్రధాన రహదారిపై వెళ్తున్న ఇసుక లారీలను ఆపి తనిఖీ చేశారు. స్పీడ్ లిమిట్ దాటి వెళ్తున్న లారీలను గుర్తించి కేసులు నమోదు చేశారు.
కొంతమంది లారీ డ్రైవర్లు మద్యం సేవించి, అతివేగంతో వాహనాలు నడుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఎస్సై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం ఇసుక లారీల అతివేగమేనని, ఇకపై స్పీడ్ లిమిట్ దాటితే లారీలను సీజ్ చేస్తామని స్పష్టం చేశారు.
లారీలకు తప్పనిసరిగా స్పీడ్ లాక్ ఉండాలని, డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడపరాదని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
ప్రతిరోజూ తనిఖీలు కొనసాగుతాయని, ప్రజల భద్రతే తమ లక్ష్యమని SI తాజుద్దీన్ తెలిపారు. ఈ తనిఖీలతో ఇసుక లారీ డ్రైవర్లలో వణుకు మొదలైంది.

