గుగ్గిళ్ళ అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాస కార్యక్రమం
బెజ్జంకి, అక్టోబర్ 9 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ళ గ్రామ అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాస కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ళ మల్లయ్య, ఉప సర్పంచ్ దుగ్యాని లావణ్య మోహన్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు,చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు పౌష్టికాహారం ఎంతో అవసరమని,పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని,పిల్లల ఎదుగుదల,ఆరోగ్య అభివృద్ధిలో పౌష్టికాహారం కీలక పాత్ర పోషిస్తుందని తెలుపుతూ,అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారాన్ని గర్భిణులు,బాలింతలు, చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ శోభ, భారతి, పంచాయతీ కార్యదర్శి వంశీధర్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్ మమతగౌతమి,ఓదయ్య,ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాస్,కారాబర్ అశోక్,ఆశాలు రజిత, అంగన్వాడి ఆయా సత్తవ్వ తదితరులు పాల్గొన్నారు.

