గ్రామస్తులు లేకుండానే అధికారులు గ్రామసభ..
ఇది జుక్కల్ గ్రామ పరిస్థితి
నన్ను అడిగేవారు ఎవరే లేరు అన్నట్టుగా గ్రామస్తులకు చెప్పకుండానే అధికారులు గ్రామసభ ఏర్పాటు…
మన ప్రజావాణి జుక్కల్ ఆర్సి ప్రతినిధి అక్టోబర్ 12
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో గల గ్రామపంచాయతీ లో గ్రామస్తులకు తెలియజేయకుండానే అధికారులు గ్రామసభ నిర్వహించారు.. ఇది అధికారుల రాజ్యం అని వారు అనుకుంటున్నారు. గ్రామస్తులు, గ్రామ ప్రజలు , యువకులు మాట్లాడుతూ గ్రామ ప్రజలకు తెలియజేయకుండా గ్రామసభ ఏ విధంగా ఏర్పాటు చేశారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.. అంటే దీన్ని పట్టి అర్థం చూస్తే అధికారులకు అడిగేవారు ఎవరూ లేరని శక్తితో వాళ్లకు నచ్చినట్టు వాళ్లే గ్రామసభ నిర్వహించుకున్నారు.. ఇది ఏ మాత్రం న్యాయం కాదు కాబట్టి గ్రామ ప్రజలకు తక్షణమే క్షమాపణ చెప్పాలి లేదంటే జుక్కల్ గ్రామం నుండి జుక్కల్ గ్రామ ప్రజలందరూ కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర తో వెళ్లి అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని ఈ సందర్భంగా గ్రామస్తులు, గ్రామ పెద్దలు యువకులు హెచ్చరించారు..

