📄 ePaper
Epaper 2
Monday, October 12, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణ6TV రిపోర్టర్ తిప్పారపు ఉపేందర్ కు ఘన సత్కారం

6TV రిపోర్టర్ తిప్పారపు ఉపేందర్ కు ఘన సత్కారం

📰 Generate e-Paper Clip

*6TV రిపోర్టర్ తిప్పారపు ఉపేందర్ కు ఘన సత్కారం*

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 9 (ప్రజావాణి): హైదరాబాద్ రవీంద్రభారతిలో పీపుల్ మీడియా పాయింట్ న్యూస్ ఛానల్ రెండో వార్షికోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. పీపుల్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో జర్నలిజం రంగంలో విశేష సేవలు అందించిన పాత్రికేయులకు పురస్కారాలు శుక్రవారం అందజేశారు.

ఈ వేడుకలో 6TV జనగామ జిల్లా రిపోర్టర్ తిప్పారపు ఉపేందర్ కు ఉత్తమ జర్నలిస్ట్ పురస్కారం-2026 లభించింది. నిష్పక్షపాత జర్నలిజం, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ వార్తలను ప్రజలకు చేరవేస్తున్నందుకు గాను నిర్వాహకులు ఆయనను శాలువా కప్పి, మెమెంటో, ప్రశంసా పత్రంతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ నటులు, మాజీ మంత్రి బాబు మోహన్ హాజరై పురస్కారాలను ప్రధానం చేశారు. జర్నలిస్టులు ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమని, వారి సేవలు అభినందనీయమని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు.

ఈ వేడుకలో పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, సీనియర్ జర్నలిస్టులు, వివిధ మీడియా సంస్థల ప్రతినిధులు, పీపుల్ సేవా ఫౌండేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.