సరస్వతి మాత కు ప్రత్యేక పూజలు చేస్తున్న సావిత్రి సాయ గౌడ్
మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 06
కామారెడ్డి జిల్లా జుక్కల్ గ్రామం లో ప్రైమరీ పాఠశాల లో నూతన కంప్యూటర్ లను జుక్కల్ గ్రామ సర్పంచ్ సావిత్రి సాయ గౌడ్ ప్రారంభించడం జరిగింది.
సరస్వతి దేవి చిత్ర పటానికి పూజ చేసి అనంతరం నూతన కంప్యూటర్ లను ప్రారంభించడం జరిగింది.
పిల్లలకు ఈ కంప్యూటర్ విద్య అభ్యసనం చాలా సులభంగా అర్థం చేసుకుంటారని,ఇష్టంగా నే ర్చుకుంటారని సర్పంచ్ తెలిపారు. మరియు విద్యార్థులకు బుట్లు,సాక్సులు,టై,యూనిఫామ్స్ అందజేయడం జరిగింది.
ఇట్టి కార్యక్రమానికి జుక్కల్ సర్పంచ్ సావిత్రి సాయ గౌడ్ , మండల విద్యాశాఖ అధికారి తిరుపతయ్య, ప్రధానోపాధ్యాయులుహన్మంతు రెడ్డి,ఉప సర్పంచ్ షేక్ ఫిర్దోస్, కాంగ్రెస్ యువ నాయకులు బొంపెళ్లివార్ విజయ్ కుమార్,ప్రైమరీ పాఠశాల హెచ్ఎం అంజలి ,పాఠశాల ఛైర్మన్ శేష బాయి,సంజయ్ సార్,బస్వంత్ సార్,రోహిణి మేడమ్, హర్తిక మేడమ్,CRP విజయ్ ప్రకాష్ సార్,భీం రావ్ సార్ పాల్గొనడం జరిగింది.

