📄 ePaper
Epaper 2
Wednesday, October 7, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ బెజ్జంకి మండల చైర్మన్‌గా బోయిని ప్రశాంత్

కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ బెజ్జంకి మండల చైర్మన్‌గా బోయిని ప్రశాంత్

📰 Generate e-Paper Clip

 

బెజ్జంకి, అక్టోబర్ 7 (ప్రజావాణి)

కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ బెజ్జంకి మండల చైర్మన్‌గా సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామానికి చెందిన బోయిని ప్రశాంత్ నియమితులయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ రాష్ట్ర చైర్మన్, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు ఈ నియామకం చేపట్టారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ సిద్దిపేట జిల్లా చైర్మన్ తప్పెట శంకర్ బోయిని ప్రశాంత్‌కు నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజలకు అందిస్తున్న ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు పార్టీలో గుర్తింపు లభిస్తుందని అన్నారు. నూతన మండల చైర్మన్ బోయిని ప్రశాంత్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ చైర్మన్ బండమీది తిరుపతి, సిద్దిపేట టౌన్ చైర్మన్ బయ్యారం యాదగిరి, అధికార ప్రతినిధి కొత్తూరు నరహరి, గుగ్గిళ్ల గ్రామ శాఖ అధ్యక్షుడు దుశెట్టి ప్రశాంత్ రెడ్డి, మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు తిప్పరవేణి బాబు, గుగ్గిళ్ల గ్రామ బీసీ సెల్ అధ్యక్షుడు కాయిత రమేష్, ఎండీ రియాజ్, నంగునూరు రాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.