*కోర్టుకు హాజరైన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి*
*నాంపల్లి ప్రత్యేక కోర్టు తుది తీర్పుతో కేసు కొట్టివేత.*
*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 07*
గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టా లకు వ్యతిరేకంగా నిర్వ హించిన రాజ్‌భవన్ ముట్టడి కార్యక్రమానికి సంబంధించిన కేసులో భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి నేడు నాంపల్లి ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. కేసు విచారణను పూర్తి చేసిన నాంపల్లి ప్రత్యేక కోర్టు తుది తీర్పుగా కేసును కొట్టివేసింది. ఎమ్మెల్యే కుంభంతో పాటు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ , యాదాద్రి డీసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షులు కాకునూరి మహేందర్ , కాంగ్రెస్ యువ నాయకులు ఏడు మేకల మహేష్ , ప్రదీప్ తదితరులు నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు.
తీర్పు అనంతరం నాయకులంతా కలిసి టీ తాగుతూ ఆత్మీయంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజ కీయ పరిణామాలు , నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలు , పార్టీ కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు.

