కాశినాయన, సెప్టెంబర్ 30 ప్రజావాణి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలతోనే దేశంలో ‘సుపోషిత భారత్’ నిర్మాణం సాధ్యమవుతుందని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో ప్రగతి పథంలో దూసుకుపోతోందని వారు కొనియాడారు.ప్రధాని మోదీ సుదీర్ఘ ప్రజా ప్రస్థానం, పరిపాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’, ‘పోషణ్ మాసం’ వేడుకల్లో భాగంగా బుధవారం కాశినాయన మండలం వరికుంట్ల గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాలలో ప్రత్యేక కార్యక్రమాలు, క్షేత్రస్థాయి పరిశీలనలు నిర్వహించారు. బీజేపీ కాశినాయన మండల అధ్యక్షుడు బిజీవేముల నారాయణరెడ్డి, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి బుసిరెడ్డి ప్రశాంతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వరికుంట్ల అంగన్‌వాడీ మెయిన్ కేంద్రంలో ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. తల్లీబిడ్డల సంరక్షణ, ఆరోగ్య సమాజ నిర్మాణమే ధ్యేయంగా జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు శారదమ్మ, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,బద్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ బుసిరెడ్డి మనోహర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఉట్టి శ్రీనివాసులు, ఐసీడీఎస్ సీడీపీఓ లక్ష్మీ ముఖ్య అతిథులుగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు అందిస్తున్న గుడ్లు, పాలు, బాలామృతం కిట్లు, ఆకుకూరలు, చిరుధాన్యాల విశిష్టతను వివరించారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక పోషకాహార ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. గర్భిణులు, బాలింతలు రక్తహీనత (ఎనీమియా) బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, పిల్లలకు సకాలంలో వ్యాక్సినేషన్ వేయించాల్సిన ఆవశ్యకతపై ఈ సందర్భంగా అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పోషణ్ అభియాన్”మాతృ వందన యోజన’ పథకాలు గ్రామీణ పేదలకు ఎంతో మేలు చేస్తున్నాయని నేతలు పేర్కొన్నారు.అనంతరం గ్రామంలో నిస్వార్థ సేవలందిస్తున్న అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు, ఆశా కార్యకర్తలను నాయకులు, అధికారులు శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో చైర్మన్ నారిశెట్టి సుప్రజ, బిజెపి జిల్లా అధ్యక్షుడు రామ సుబ్బారెడ్డి, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు మునీంద్ర యాదవ్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు ఎదురు నాగార్జున రెడ్డి, బిజెపి మండల ఉపాధ్యక్షులు సురేష్ నాయుడు,బసిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి, పోరుమామిళ్ల మండల అధ్యక్షుడు నాగేంద్ర, ప్రతాప్ రెడ్డి, పూర్వ ఎబివిపి నాయకులు ప్రసాద్, రవిచంద్ర,గురయ్య తో పాటు గ్రామ మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలతోనే సుపోషిత భారత్* *వరికుంట్లలో ఘనంగా అంగన్‌వాడీ ఉత్సవాలు* *సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడమే బిజెపి లక్ష్యం
RELATED ARTICLES

