కేంద్ర ప్రభుత్వ పథకాలతోనే సుపోషిత భారత్* *వరికుంట్లలో ఘనంగా అంగన్‌వాడీ ఉత్సవాలు* *సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడమే బిజెపి లక్ష్యం
కాశినాయన, సెప్టెంబర్ 30 ప్రజావాణి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలతోనే దేశంలో 'సుపోషిత భారత్' నిర్మాణం సాధ్యమవుతుందని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో ప్రగతి పథంలో దూసుకుపోతోందని వారు కొనియాడారు.ప్రధాని మోదీ సుదీర్ఘ ప్రజా ప్రస్థానం, పరిపాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’, ‘పోషణ్ మాసం’ వేడుకల్లో భాగంగా బుధవారం కాశినాయన మండలం వరికుంట్ల గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాలలో ప్రత్యేక కార్యక్రమాలు, క్షేత్రస్థాయి పరిశీలనలు నిర్వహించారు. బీజేపీ కాశినాయన...