📄 ePaper
Epaper 2
Wednesday, September 30, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్ఆంధ్రప్రదేశ్ నాన్-గెజిటెడ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అసోసియేషన్’స్ బద్వేల్ తాలూకా అధ్యక్షుడిగా ఆర్. అమర్నాథ్ రెడ్డి ఏకగ్రీవ...

ఆంధ్రప్రదేశ్ నాన్-గెజిటెడ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అసోసియేషన్’స్ బద్వేల్ తాలూకా అధ్యక్షుడిగా ఆర్. అమర్నాథ్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక: ఉద్యోగుల పక్షాన సరికొత్త శకం!

📰 Generate e-Paper Clip

నాయకత్వం అంటే కేవలం పదవి కాదు.ఉద్యోగుల సంక్షేమం కోసం అడుగడుగునా నిలిచే ఒక నమ్మకం. సమర్థత, నిబద్ధత కలగలిసిన చోట ఏకగ్రీవ ఎన్నిక ఏకపక్ష తీర్పు అవుతుంది.

బద్వేల్: కడప జిల్లా సెప్టెంబర్ 30ప్రజావాణి తాలూకా ఆంధ్రప్రదేశ్ నాన్-గెజిటెడ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అసోసియేషన  తాలూకా నూతన అధ్యక్షుడిగా ఆర్. అమర్నాథ్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా నడిచే ఈ ప్రతిష్టాత్మక సంఘం బద్వేల్ తాలూకా బాధ్యతలను ఆయనకు అప్పగించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం కాశినాయన మండలం తహశీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఆర్, అమర్నాథ్ రెడ్డి సమర్థత, ఉద్యోగ వర్గాల్లో ఆయనకు ఉన్న ఆదరణను గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నారుకడప జిల్లా అధ్యక్షులు మరియు జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఛైర్మన్ బలపనూరు శ్రీనివాసులు గారి సమక్షంలో మరియు వారి అధ్యక్షతన ఈ ఎన్నికల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, ఏకగ్రీవంగా జరిగింది. ఉద్యోగ క్షేత్రంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటూ, అందరినీ కలుపుకొనిపోయే గుణం ఉన్న అమర్నాథ్ రెడ్డి ఈ పదవికి పూర్తి న్యాయం చేయగలరని జిల్లా నాయకత్వం ఆకాంక్షించింది.ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో జిల్లా మరియు తాలూకా స్థాయి ముఖ్యాధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాల్గొన్న వారిలో:జిల్లా ట్రెజరర్: టి. శ్రీనివాసులు,జిల్లా జాయింట్ సెక్రటరీలు:డి.పద్మనాభం,పి. శైలేశ్వర రెడ్డి,తాలూకా అధ్యక్షులు:టి.నరసింహా రెడ్డి, కార్యదర్శి: శివరామి రెడ్డి,గౌరవ అధ్యక్షులు:సాధు వెంకటేశ్వర్లు,వీరితో పాటు తాలూకా కార్యవర్గ సభ్యులు, వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొని నూతన అధ్యక్షుడికి ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు.సరికొత్త ఆశలు -ఉద్యోగుల హర్షం:ఆర్. అమర్నాథ్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల బద్వేల్ తాలూకా ఎన్జీవోలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.నిరంతరం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి, వారి సంక్షేమానికి సరికొత్త వ్యూహాలతో, నూతనోత్తేజంతో ముందుకు సాగుతానని, జిల్లా నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆయన నాయకత్వంలో బద్వేల్ ఆంధ్రప్రదేశ్ నాన్-గెజిటెడ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అసోసియేషన్’స్ సంఘం మరిన్ని విజయాలు అందుకోవాలని తోటి ఉద్యోగులు ఆకాంక్షిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.