📄 ePaper
Epaper 2
Wednesday, September 30, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriకొర్రెములలో ఘనంగా గణేశ నిమజ్జన కార్యక్రమం.....భక్తిశ్రద్ధలతో గణనాథుడి శోభాయాత్ర.. పాల్గొన్న కర్రే రాజేష్, సామల అమరేందర్

కొర్రెములలో ఘనంగా గణేశ నిమజ్జన కార్యక్రమం…..భక్తిశ్రద్ధలతో గణనాథుడి శోభాయాత్ర.. పాల్గొన్న కర్రే రాజేష్, సామల అమరేందర్

📰 Generate e-Paper Clip

పోచారం డివిజన్, సెప్టెంబర్ 29 (ప్రజావాణి): పోచారం డివిజన్ పరిధిలోని కొర్రెముల గ్రామంలో గణేశ నిమజ్జన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గణనాథుడి నిమజ్జనాన్ని పురస్కరించుకుని గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో పోచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కర్రే రాజేష్, ఎదులాబాద్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సామల అమరేందర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భక్తులతో కలిసి గణనాథుడి శోభాయాత్రను ఘనంగా ప్రారంభించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రారంభమైన శోభాయాత్రలో యువత ఉత్సాహంగా పాల్గొనగా, భక్తులు గణేశుడి నామస్మరణలతో సందడి చేశారు. డప్పుల మోతలు, భక్తుల జయజయధ్వానాలతో కొర్రెముల ప్రధాన వీధులు సందడిగా మారాయి.

శోభాయాత్రలో స్థానిక భక్తులు, యువకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి వీడ్కోలు పలికారు. అనంతరం భక్తిశ్రద్ధలతో గణేశ విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరిగేలా నిర్వాహకులు అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు.

ఈ సందర్భంగా నాయకులు, నిర్వాహకులు మాట్లాడుతూ.. గణనాథుడి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.