కొర్రెములలో ఘనంగా గణేశ నిమజ్జన కార్యక్రమం…..భక్తిశ్రద్ధలతో గణనాథుడి శోభాయాత్ర.. పాల్గొన్న కర్రే రాజేష్, సామల అమరేందర్

పోచారం డివిజన్, సెప్టెంబర్ 29 (ప్రజావాణి): పోచారం డివిజన్ పరిధిలోని కొర్రెముల గ్రామంలో గణేశ నిమజ్జన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గణనాథుడి నిమజ్జనాన్ని పురస్కరించుకుని గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో పోచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కర్రే రాజేష్, ఎదులాబాద్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సామల అమరేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులతో కలిసి గణనాథుడి శోభాయాత్రను ఘనంగా ప్రారంభించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రారంభమైన శోభాయాత్రలో యువత ఉత్సాహంగా పాల్గొనగా, భక్తులు గణేశుడి నామస్మరణలతో...