📄 ePaper
Epaper 2
Tuesday, September 29, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ప్రారంభం

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ప్రారంభం

📰 Generate e-Paper Clip

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ప్రారంభం..
​పితృ మహాలయ పక్షాల సందర్భంగా 15 రోజుల పాటు నిత్యాన్నదానం…
అన్నదానం పుణ్యకార్యం మున్సిపల్ కమిషనర్…
​కోదాడ, సెప్టెంబర్ 28/ ప్రజావాణి
​ అన్నదానం పుణ్యకార్యమని కోదాడ మున్సిపల్ కమిషనర్ రమాదేవి అన్నారు. సోమవారం కోదాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని రంగా థియేటర్ లో పితృ మహాలయ పక్షాల సందర్భంగా ఏర్పాటు చేసిన 15 రోజుల అన్నదాన కార్యక్రమన్ని ఆమెముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.మొదటి రోజు అన్నదాన దాతగా గాదంశెట్టి అశ్వద్ధనారాయణ జ్ఞాపకార్థం ఆయన కుమారుడు గాదంశెట్టి శ్రీనివాసరావు వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం నాయకులు మాట్లాడుతూ నేటి నుండి 15 రోజుల పాటు పితృ పక్షాల సందర్భంగా పేదలకు నిరంతరం అన్నదాన కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు పైడిమర్రి సత్తిబాబు, పైడిమర్రి నారాయణరావు, పందిరి సత్యనారాయణ, గరినే ఉమా, శ్రీధర్, చల్లా ప్రకాష్, ఇరుకుల్లా చెన్నకేశవరావు, కొత్తూరు శ్రీను, శంకర్, సాయి, చీదెళ్ల హనుమంతరావు, వెంపటి ప్రసాద్, పైడిమర్రి రామారావు, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.