*టి టి డీ ఆధ్వర్యంలో అఖండ హరినామ సంకీర్తనలో ఫైజాబాద్ హనుమాన్ భజన మండలి*
చిలిపిచెడ్. సెప్టెంబర్ 29 మన ప్రజావాణి
తిరుమల తిరుపతి దేవస్థానముల హిందూ ధర్మ ప్రచార పరిషత్ లో భాగంగా నిర్వహిస్తున్న అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమానికి మెదక్ జిల్లా, చిలిపిచెడ్ మండలం, ఫైజాబాద్ గ్రామానికి చెందిన శ్రీ హనుమాన్ భజన మండలిని టిటిడి ఆహ్వానించింది.
ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం 12 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నిరంతరాయంగా శ్రీ వెంకటేశ్వర, పద్మావతి, శ్రీరాముల వారి భజన పాటలను స్వామి వారి సేవలో గానం చేయడం జరిగింది. అలాగే రాత్రి 12 గంటల నుండి తెల్లవారుజాము 3 గంటల వరకు కూడా ప్రోగ్రాం కొనసాగుతుందని తెలియజేశారు.
ఈ సందర్భంగా హనుమాన్ భజన మండలి సభ్యులు మాట్లాడుతూ… “తిరుమల వంటి పవిత్ర క్షేత్రంలో ఈ అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమంలో పాల్గొనడం ఎన్నో జన్మలుగా చేసుకున్న పుణ్య ఫలం” అని ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో హనుమాన్ భజన మండలి ఉపాధ్యక్షులు జనార్దన్, సభ్యులు రాములు, సుభాష్, శ్రీశైలం, రవీందర్, మధుసూదన్ గౌడ్, కుమార్, ఫైజాబాద్ భజన భక్తులుతదితరులు పాల్గొన్నారు.

