*దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తోటకూరి రమేష్ నియామకం*
జనగామ జిల్లా ప్రతినిధి (దేవరుప్పుల), సెప్టెంబర్ 29 (ప్రజావాణి):
జిల్లా లోని దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా తోటకూరి రమేష్ ని పాలకుర్తి ఎమ్మెల్యే శ్రీమతి మామిడాల యశస్విని రెడ్డి నియమించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నూతనంగా నియమితులైన తోటకూరి రమేష్ కి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని సూచించారు.
ఈ నియామకం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ తోటకూరి రమేష్ కి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో దేవరుప్పుల మండల పార్టీ అధ్యక్షుడు అనిల్ కుమార్, ఎస్సీ సెల్ అధ్యక్షులు ఇనుముల నాగరాజు, ఎస్టీ సెల్ అధ్యక్షులు భూక్య సజ్జన్, కిసాన్ సెల్ అధ్యక్షులు గోపు సుధాకర్ రెడ్డి, యూత్ అధ్యక్షుడు పులిగిల్ల వెంకన్న, రెడ్డి రాజుల రమేష్, మొటికె చంద్రశేఖర్, ఓడపెల్లి రవి, బానోత్ రామచంద్రు, కౌడగాని నర్సింగారావు, అనంతోజు రాజయ్య, చెన్నూరు రాంబాబు, గుగులోత్ నరేందర్, బట్ట అంజయ్య, ఇనుముల బిక్షపతి, కారుపోతుల విజయ్ కుమార్, సోషల్ మీడియా కోఆర్డినేటర్లు గానుపాక ప్రదీప్, లోడంగి అశోక్, పులిగిల్ల అఖిల్ దేవ్ తదితరులు పాల్గొన్నారు.

