📄 ePaper
Epaper 2
Tuesday, September 29, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణరామచంద్రాపురం గ్రామంలో ఘనంగా స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం

రామచంద్రాపురం గ్రామంలో ఘనంగా స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం

📰 Generate e-Paper Clip

రామచంద్రాపురం గ్రామంలో ఘనంగా స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం.

మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఆదేశానుసారం స్మార్ట్ కార్డు పంపిణీ కార్యక్రమం.

భీముడు నాయక్ ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం.

హుజూర్నగర్ సెప్టెంబర్ 29 (ప్రజావాణి)

సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండలం లోని రామచంద్రపురం గ్రామంలో ఘనంగా స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఆంగోతు స్వరాజ్యం, ఉప సర్పంచ్ మాలోతు రాజు, వీఆర్వో ప్రకాష్, కార్యదర్శి లక్ష్మీపార్వతి చేతులమీదుగా స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఉమ్మడి రామచంద్రపురం గ్రామ మాజీ సర్పంచ్ మాలోతు బుజ్జి భీముడు నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు కడుపునిండా అన్నం పెట్టే సన్న బియ్యం పథకం ఎంతో మంచి పథకం అని భీముడు నాయక్ అన్నారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో పేద ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు. దేశంలో అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ సన్నబియ్యం పథకం అమలు కాలేదన్నారు. గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క తెల్ల రేషన్ కార్డు ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 16.32,810 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసిందన్నారు. తెలంగాణలో మొత్తం కలిపి1,06,28,092 రేషన్ కార్డులు ఉన్నాయని, దీంతో 3,42,57,109 మంది నిరుపేదలు ఆహార భద్రత లబ్ధి పొందనున్నట్లు తెలిపారు. సన్న బియ్యం పంపిణీతో పేద ప్రజలకు కడుపునిండా భోజనం పెడుతున్నామని గత ప్రభుత్వం హయాంలో ఇచ్చిన దొడ్డుబియ్యం కోళ్ల ఫారాలు, బీర్ల తయారీ, రైస్ మిల్లర్లు అక్రమ వ్యాపారానికి స్కామ్ గా ఉపయోగపడ్డాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి పేదవాడికి తెల్ల రేషన్ కార్డు ఇచ్చి, ప్రతి ఒక్క మనిషికి 6 కిలోల చొప్పున ఉచిత బియ్యం అందిస్తుందని, రాష్ట్రంలో 85% మంది జనాభా కు కడుపునిండా అన్నం పెట్టే పథకం పెట్టడం చాలా మంచి పథకం అని మాలోతు భీముడు నాయక్ అన్నారు.

*కార్యదర్శి లక్ష్మి పార్వతి మాట్లాడుతూ*

అర్హులై ఉండి ఎవరికైనా కార్డు రాని వారు రేషన్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకోవాలని, కొత్త రేషన్ కార్డు అర్హులైన ప్రతి ఒక్కరికి వస్తుంది అని కార్యదర్శి లక్ష్మీపార్వతి అన్నారు.
ఈ కార్యక్రమంలో భీమ్లా తండా సర్పంచ్ నాగు నాయక్, భీమ్లా తండ ఉప సర్పంచ్ జామా నాయక్, రామచంద్రాపురం గ్రామ శాఖ అధ్యక్షులు రూపావత్ పటేల్ నాయక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుర్రి సైదులు, వార్డు సభ్యులు, రామచంద్రపురం గ్రామ డీలర్, రామచంద్రాపురం, బొజ్జ తండా, భీమ్లా తండా గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.