📄 ePaper
Epaper 2
Tuesday, September 29, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్కేంద్రం ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను పదవి నుండి తొలగించాలి

కేంద్రం ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను పదవి నుండి తొలగించాలి

📰 Generate e-Paper Clip

కేంద్రం ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను పదవి నుండి తొలగించాలి

పలాస ప్రజావాణి ప్రతినిధి

కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ ను పదవి నుంచి తొలగించాలని అలాగే
,SIR ప్రక్రియను నిలిపివేయాలని ఓటర్ జాబితా నుండి అన్యాయంగా తొలగించిన వారందరినీ ఓటు హక్కును పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 2 వ తేదీన పలాస ఆర్ టి సి కాంప్లెక్స్ నుండి కాశీబుగ్గ బస్టాండ్ వరకు జరిగే వామపక్షాల, ప్రజా సంఘాల నిరసన ర్యాలీ ని జయప్రదం చేయాలని వామపక్ష నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక లిబరేషన్ పార్టీ కార్యాలయంలో వామపక్ష పార్టీల ప్రజా సంఘాల సన్నాహాక సమావేశం జరిగింది. ఈ సందర్బంగా నాయకులు టి సన్యాసి రావు, యన్ గణపతి, ఎం వినోద్ కుమార్ లు మాట్లాడుతూ ప్రజా స్వామ్యం కూనీ చేస్తూ ఎన్నికల కమిషన్ లోని ప్రధాన కమీషనర్ ఏకపక్ష నిర్ణయం ప్రజల అస్థిత్వాన్ని దెబ్బ తీసిందని అన్నారు. వెంటనే సర్ ప్రక్రియ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. బి జె పి తన అనుకూల విధానం అమలుచేసుకుంటూ సి ఇ సి ని తప్పుతోవ పట్టించారని విమర్శించారు. ఈ విధానాలుపై ప్రజలను చైతన్య పరిచెందుకు జరిగే ర్యాలీ జయప్రదం చేయాలని, ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మద్దిలి రామారావు, గోరు వాసు, కె దుష్యంత్, కె లోకనాధం, శివ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.