📄 ePaper
Epaper 2
Tuesday, September 29, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriఅప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్: అంకుశాపూర్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంకు చెందిన అంధుగుల రాజు (43) తన భార్య, పిల్లలతో కలిసి గత ఐదేళ్లుగా అంకుశాపూర్‌లోని భాగ్యనగర్ హ్యాచరీస్‌లో కూలి పనులు చేస్తున్నాడు. కుమార్తె వివాహం కోసం అప్పులు చేసిన రాజు.. ఆర్థిక ఇబ్బందులు, మద్యానికి బానిస కావడంతో మనస్తాపానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. భార్య పనికి వెళ్లిన సమయంలో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గుర్తించి కిందకు దించేసరికే మృతి చెందినట్లు తెలిపారు. భార్య స్వర్ణకుమారి ఫిర్యాదు మేరకు ఘట్‌కేసర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.