అనారోగ్య సమస్యలతో జీవితంపై విరక్తి చెంది వివాహిత వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన గొల్లపల్లి మండలంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ ఎం కృష్ణ సాగర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… శంకర్రావుపేట గ్రామానికి చెందిన గాజుల లత (48) గత కొన్ని సంవత్సరాలుగా క్యాన్సర్ గడ్డలతో బాధపడుతోంది. దీంతో జీవితంపై విరక్తి చెందిన ఆమె సోమవారం ఉదయం తన వ్యవసాయ బావిలో దూకి ప్రాణాలు విడిచింది. మృతురాలి తమ్ముడు గోలి రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గొల్లపల్లి ఎస్‌ఐ తెలిపారు.

