📄 ePaper
Epaper 2
Wednesday, September 30, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణవెంకటేశ్వరవైన్స్.పైచర్యలుతీసుకోవాలిప్రజావాణిలో ఫిర్యాదు చేసిన కౌన్సిలర్ మంద రాధ

వెంకటేశ్వరవైన్స్.పైచర్యలుతీసుకోవాలిప్రజావాణిలో ఫిర్యాదు చేసిన కౌన్సిలర్ మంద రాధ

📰 Generate e-Paper Clip

వెంకటేశ్వరవైన్స్.పైచర్యలుతీసుకోవాలిప్రజావాణిలో ఫిర్యాదు చేసిన కౌన్సిలర్ మంద రాధ

జమ్మికుంట సెప్టెంబర్ 28( ప్రజావాణి)

జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 22వ వార్డు కేరళ స్కూల్ సమీపంలో ఉన్న వెంకటేశ్వర వైన్స్ ను తక్షణమే రద్దుచేసి వైన్స్ పై చర్యలు తీసుకోవాలని ఆ వార్డ్ కౌన్సిలర్ మంద రాధ సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణిలో ఫిర్యాదు చేశారుఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మా వార్డు పరిధిలో ఉన్న హరిహర టాకీస్ కేరళ స్కూల్ మధ్యలో ఉన్న వెంకటేశ్వర వైన్స్ అపరిశుభ్రంగా ఉంచడం. మూత్రశాలలు అపరిశుభ్రంగా నిర్వహించడం విపరీతమైన దుర్వాసనతో రోడ్డు నుండి వెళ్లే వాహనదారులకు పాదాచార్యులు ఇబ్బంది పడుతున్నారు. పాఠశాలలకు దేవాలయాలకు 100 మీటర్ల దూరంలో ఉండాల్సిన వైన్స్ కేరళ స్కూల్ కు అతి దగ్గరగా ఉండడం విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై క్షేత్రస్థాయిలో విచారణ చేసి వెంకటేశ్వర వైన్స్ ను అక్కడినుండి తరలించి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.