📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMahabubabadఎం జె పి గురుకుల పాఠశాలలో విద్యార్థికి ప్రమాద ఘటన

ఎం జె పి గురుకుల పాఠశాలలో విద్యార్థికి ప్రమాద ఘటన

📰 Generate e-Paper Clip

ఎం జె పి గురుకుల పాఠశాలలో విద్యార్థికి ప్రమాద ఘటన

*విద్యార్థులతో వంట కట్టెలు కొట్టిస్తున్న సందర్భంలో ప్రమాద ఘటన జరిగినట్లు సమాచారం*

*విద్యార్థి పాలకుర్తి మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తింపు*

*పాఠశాల ప్రిన్సిపాల్ తీరుపై బగ్గుమన్న స్థానికులు*

*తొర్రూర్ లో ఉన్న సిరి హాస్పిటల్ లో వైద్య చికిత్స అందిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం*

తొర్రూర్
సెప్టెంబర్ 28

 

పెద్ద వంగర మండల జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల తొర్రూరు పట్టణ కేంద్రంలో నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాల యందు 9వ తరగతి విద్యార్థి ప్రమాదానికి గురైనట్లు విశ్వసనీయ సమాచారం. సోమవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో పాఠశాల ప్రిన్సిపాల్ విద్యార్థులతో ప్రతిరోజు , వంట చేయుటకు కట్టెలను కొట్టిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాని మూలంగానే విద్యార్థికి కట్టే ఎగిరి వచ్చి మూతికి తగలడంతో రక్తస్రావం కావడంతో హుటా హుటిన తొర్రూరు పట్టణ ప్రాంతంలో ఉన్న సిరి హాస్పిటల్ లో గుట్టు చప్పుడు కాకుండా వైద్య చికిత్సలు అందిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా ఈ ఘటన విషయంలో విద్యార్థి నుండి సమాచారం బయటికి రాకుండా ప్రిన్సిపాల్ విద్యార్థిని బెదిరించి మెట్లు జారిపడ్డాడని తప్పుడు సమాచారాన్ని అందిస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.పాఠశాల ప్రిన్సిపాల్ గత కొద్ది రోజులుగా, విద్యార్థులను, కూలీల కంటే హీనంగా పనిచేయిస్తున్నాడని స్థానిక పట్టణ ప్రజలు చెప్పుకొస్తున్నారు. గత వారం రోజుల క్రితం కూడా మరో విద్యార్థికి కూడా కర్ర ఎగిరి వచ్చి చాతిలో తగలడంతో ప్రాణాపాయ స్థితి కి వెళ్ళిన ఘటన కూడా వెలుగులోకి రాకుండా, ప్రిన్సిపాల్ జాగ్రత్త వహించాడని వినికిడి. ఎం జె పి పాఠశాలలో విద్యార్థులు రాత్రిపూట సినిమాలకు, వెళుతున్న, మద్యం సేవిస్తున్న ప్రిన్సిపాల్, గాలికి వదిలేసి, ఆయన ఇష్టానుసారమైన, విధి నిర్వహణ చేయడం పరిపాటిగా మారిందని, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 20 ఏళ్లుగా తొర్రూరు పట్టణ కేంద్రంలో బేబీ బర్డ్ ప్రవేటు పాఠశాలను కూడా ఈ ప్రిన్సిపాల్ నిర్వహించుకుంటూ, 8 ఏళ్లుగా జ్యోతిబాపూలే పాఠశాలలో పనిచేస్తూ, ఎం జె పి లో కంటే తన ప్రైవేట్ పాఠశాల లోనే ఎక్కువ సమయాన్ని కడుపుతున్నాడని,తొర్రూరు పట్టణ ప్రాంతంలో గత 20 ఏళ్లుగా ఉండి, నేను లోకల్ అంటూ అందరినీ బెదిరిస్తున్నాడని, ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.పాఠశాలలో పనిచేసే వర్కర్లతో తన ఇంటి పనులు చేయించుకుంటున్నాడని, అలా చేయని వారిని ఎలాంటి కారణం లేకుండా తొలగించాడని కూడా ఇతనిపై ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కావున మహాత్మ జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపాల్ వ్యవహారంపై విద్యార్థికి జరిగిన ఘటనపై బీసీ వెల్ఫేర్ సెక్రెటరీ, వరంగల్ ఆర్ సి ఓ తగు విచారణ చేపట్టి పాఠశాల సిసి ఫుటేజీలను, పరిశీలించి, ప్రిన్సిపాల్ పై చట్టపరమైన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.