📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణWarangalరెఖ్య నాయక్ తండాను ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయాలి

రెఖ్య నాయక్ తండాను ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయాలి

📰 Generate e-Paper Clip

రెఖ్య నాయక్ తండాను ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయాలి

సెప్టెంబర్ 28.ప్రజావాణి న్యూస్/సంగెం

రెఖ్య నాయక్ తండాను ప్రత్యేక నూతన గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయాలని రేవంత్ రాథోడ్ కోరారు.2018లో గ్రామపంచాయతీల పునర్విభజన సమయంలో ఎలాంటి గ్రామసభ,ప్రజాభిప్రాయం, స్థానిక తీర్మానం లేకుండానే సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోచమ్మ తండా గ్రామపంచాయతీలో రెఖ్య నాయక్ తండాను కలిపారని తెలిపారు.పరిపాలనా కేంద్రం దూరంగా ఉండటంతో తండా ప్రజలు ప్రభుత్వ సేవలు పొందడం,అభివృద్ధి పనులు మంజూరు చేయించుకోవడం, మౌలిక సదుపాయాలు సాధించుకోవడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ పరిస్థితి వల్ల తండా అభివృద్ధి సంవత్సరాలుగా ఆశించిన స్థాయిలో జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.2018 నుంచి రెఖ్య నాయక్ తండాను ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయాలని నిరంతరం పోరాడుతూ,అనేకసార్లు అధికారులకు వినతిపత్రాలు,రిప్రజెంటేషన్లు సమర్పించినప్పటికీ ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం లభించలేదని రేవంత్ రాథోడ్ తెలిపారు.అదేవిధంగా, ఆర్టిఐ చట్టం ద్వారా అధికారిక సమాచారాన్ని సేకరించగా, రెఖ్య నాయక్ తండాకు సంబంధించిన నిధులు 2018 తర్వాత కూడా వంజరపల్లి గ్రామపంచాయతీలో జమ/సర్దుబాటు అవుతున్నట్లు వివరాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. 2018 తర్వాత రెఖ్య నాయక్ తండా పోచమ్మ తండా గ్రామపంచాయతీలో ఉన్నప్పటికీ నిధుల లెక్కలు వంజరపల్లి గ్రామపంచాయతీలో కొనసాగుతున్న అంశంపై 2018 నుంచి ఇప్పటివరకు నిధులపై పూర్తి స్థాయి ఆడిట్ నిర్వహించి, తండాకు అర్హత కలిగిన నిధులను తండా అభివృద్ధికే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.రెఖ్య నాయక్ తండా ప్రజల సమస్యను కేవలం పరిపాలనా సమస్యగా కాకుండా దీర్ఘకాలంగా అభివృద్ధికి దూరమైన ఒక తండా ప్రజల హక్కులు, మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమస్యగా ప్రభుత్వం పరిగణించాలని రేవంత్ రాథోడ్ కోరారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి రెఖ్య నాయక్ తండాను ప్రత్యేక నూతన గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయడంతో పాటు, 2018 నుంచి తండాకు సంబంధించిన నిధులపై సమగ్ర విచారణ చేపట్టి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమస్యకు తగిన పరిష్కారం లభించని పక్షంలో, తదుపరి చట్టబద్ధమైన మార్గాల్లో సంబంధిత జాతీయ స్థాయి మానవ హక్కుల సంస్థలు,ముఖ్యంగా జాతీయ ఎస్టీ కమిషన్ (NCST) దృష్టికి తీసుకెళ్లి న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తానని రేవంత్ రాథోడ్ స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.