📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణ2003–04 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం

2003–04 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం

📰 Generate e-Paper Clip

2003–04 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం

భిక్కనూర్, సెప్టెంబర్ 28 ( ప్రజావాణి ):

భిక్కనూరు మండలంలోనిపెద్దమల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2003–04 విద్యా సంవత్సరంలో చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం పెద్ద మల్లారెడ్డివీరభద్ర ఫంక్షన్ హల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై తమ పాత జ్ఞాపకాలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుంటూ, విద్యార్థి దశలో కలిసి గడిపిన మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, ఆత్మీయ సమావేశం నిర్వహించి నాటి గురువులు, పాఠశాలతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

సరస్వతీ దేవి ఆశీస్సులతో కార్యక్రమాన్ని ప్రారంభించి, పూర్వ విద్యార్థులంతా కలిసి సమూహ ఫొటోలు దిగారు. చాలాకాలం తర్వాత ఒకే వేదికపై కలుసుకోవడం ఆనందంగా ఉందని పూర్వ విద్యార్థులు తెలిపారు. భవిష్యత్తులోనూ ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తూ పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో 2003–04 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.