📄 ePaper
Epaper 2
Saturday, September 26, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణమండల కేంద్రంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించిన గ్రామ సర్పంచ్ లలిత రమేష్ యాదవ్

,సెప్టెంబర్26. ప్రజావాణి న్యూస్//సంగెం

సంగెం మండలం కేంద్రంలో చాకలి ఐలమ్మకొంగు నడుముకు చుట్టవే చెల్లమ్మ, కొడవళ్లు చేపట్టవే చెల్లమ్మ” అని పాడుతూ పేదల పక్షాన నిలబడి భూమి కోసం, భుక్తి కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహా యోధురాలు కీ.శే. చిట్యాల (చాకలి) ఐలమ్మ అని పలువురు నాయకులు కొనియాడారు.శనివారం రోజున సంగెం మండల రజక సంఘాల ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పేదలకు పండ్ల పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగెం సర్పంచ్ పేర్ల లలిత రమేష్ హాజరై ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ వేడుకల్లో ఉప సర్పంచ్ ఆగపాటి రాజకుమార్, మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్, మండల బీసీ నాయకులు మునుకుంట్ల కోటేశ్వర్, మాజీ సర్పంచ్‌లు గుండేటి బాబు, ఎల్లయ్య, నల్లతీగల రవి, మునుకుంట్ల చంద్రశేఖర్, వీరాచారి మండల రజక సంఘం గౌరవ అధ్యక్షులు మునుకుంట్ల మోహన్, ఉపాధ్యక్షులు ఎ. రమేష్, బోగి రవి, బద్రీనాథ్, చాపర్తి శ్రీను, ఎన్. శంకర్, నాగేష్‌లతో పాటు గ్రామ నాయకులు కె. సంపత్, కె. శరత్, మెట్టుపల్లి మల్లయ్య, కృష్ణ, బాబు, జి. ఎల్లయ్య, రావుల సూరయ్య, మునుకుంట్ల శ్రీను, ఎన్. కుమార్, అప్పాల కవిత తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.