📄 ePaper
Epaper 2
Saturday, September 26, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్ఎల్లంపేట్‌లో వైభవంగా బీజేపీ ‘అంగన్ మిలాన్’ సేవా కార్యక్రమం

ఎల్లంపేట్‌లో వైభవంగా బీజేపీ ‘అంగన్ మిలాన్’ సేవా కార్యక్రమం

📰 Generate e-Paper Clip

ఎల్లంపేట్‌లో వైభవంగా బీజేపీ ‘అంగన్ మిలాన్’ సేవా కార్యక్రమం

అంగన్వాడీ కేంద్రాల సందర్శన.. టీచర్లు, ఆశా వర్కర్లకు ఘన సన్మానం

ఎల్లంపేట్, ప్రజా వాణి:- భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘అంగన్ మిలాన్’ సేవా కార్యక్రమంలో భాగంగా ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని ఎల్లంపేట్, బండమాదారం వార్డుల్లో అంగన్వాడీ కేంద్రాలను బీజేపీ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల్లో అందుతున్న సేవలను పరిశీలించి, గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందిస్తున్న పోషకాహారం, సంక్షేమ కార్యక్రమాలపై వివరించారు.

కేంద్ర ప్రభుత్వం ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందుతున్న విషయాన్ని ప్రజలకు తెలియజేస్తూ, అంగన్వాడీ కేంద్రాల ద్వారా సేవలు అందిస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లను నాయకులు ఘనంగా సన్మానించారు. మహిళలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో అంగన్వాడీ సిబ్బంది చేస్తున్న సేవలను అభినందించారు.

పలువురు నాయకుల హాజరు

ఈ కార్యక్రమంలో ఎల్లంపేట్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మేకల రజిత దేవేందర్ రెడ్డి, మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షుడు శ్రీశైలం యాదవ్, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు గౌరారం జగన్ గౌడ్, కౌన్సిలర్లు అర్చన శ్రీనివాస్, మహేశ్వరి రాజేష్, శారద రాజు నాయక్ పాల్గొన్నారు.

అలాగే బీజేపీ జనరల్ సెక్రటరీ కంచగంట మహేష్, సీనియర్ నాయకులు పోచయ్య ముదిరాజ్, పుష్ప మల్లారెడ్డి, నాగేష్ ముదిరాజ్, రవి నాయక్, లక్ష్మణ్, హరిప్రసాద్ గౌడ్, నాగార్జున రెడ్డి, చంద్రం, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

అంగన్వాడీ సిబ్బందిని సన్మానించడం ద్వారా వారి సేవలను గుర్తించి, మహిళలు, చిన్నారుల సంక్షేమంపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నాయకులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.