📄 ePaper
Epaper 2
Saturday, September 26, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా గుండ్లపోచంపల్లి డివిజన్‌లో సేవా కార్యక్రమాలు

సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా గుండ్లపోచంపల్లి డివిజన్‌లో సేవా కార్యక్రమాలు

📰 Generate e-Paper Clip

ఉపాధ్యాయులకు సన్మానం.. విద్యార్థులకు పండ్లు, బిస్కెట్ల పంపిణీ

సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా గుండ్లపోచంపల్లి డివిజన్‌లో సేవా కార్యక్రమాలు

గుండ్లపోచంపల్లి (ప్రజావాణి):- ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా 25 ఏళ్ల ప్రజా సేవను పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప అభియాన్’లో భాగంగా గుండ్లపోచంపల్లి డివిజన్‌లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. డివిజన్ కన్వీనర్ చింతలపూడి రామారావు ఆధ్వర్యంలో గుండ్లపోచంపల్లి డివిజన్‌లోని పాఠశాలలో ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. అనంతరం విద్యార్థులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కామారెడ్డి ఇన్‌చార్జి పట్లోళ్ల విక్రంరెడ్డి, మేడ్చల్ రూరల్ ప్రధాన కార్యదర్శి అమరం మోహన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా ప్రజల మధ్య సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్నట్లు తెలిపారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు పునాది స్తంభాలని, వారి త్యాగం, అంకితభావం వల్లే భావితరాలు ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు దొడ్ల మల్లికార్జున్ ముదిరాజ్, అమరం సరస్వతి, డివిజన్ అధ్యక్షుడు కావేరి శ్రీధర్ ముదిరాజ్, ప్యాక్స్ మాజీ చైర్మన్ జైతువాళ్ల కిషన్, ప్రధాన కార్యదర్శి జైతువాళ్ల కృష్ణ, మహిళా మోర్చా అధ్యక్షురాలు బట్టికాడి నవనీత, సోషల్ మీడియా ఇన్‌చార్జి ప్రవీణ్ గౌడ్, బూత్ అధ్యక్షులు ఎస్. నవీన్, అభిలాష్, పాండు తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.