పోరుమామిళ్ల సెప్టెంబర్లో 25 ప్రజావాణి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మాజీ ఛైర్మన్ డా. సతీష్ ధావన్ జయంతి సందర్భంగా విద్యార్థులకు శాస్త్రీయ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా భౌతిక శాస్త్ర విభాగం ఇన్‌చార్జి డా. కె.వెంకటరావు మాట్లాడుతూ, భారత అంతరిక్ష పరిశోధన రంగ అభివృద్ధిలో డా. సతీష్ ధావన్ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. భారతదేశంలో అంతరిక్ష పరిశోధనకు బలమైన పునాది వేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు. విద్యార్థులు శాస్త్రవేత్తల జీవితాలు, పరిశోధనలు, కృషి నుంచి స్ఫూర్తి పొంది శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.అలాగే విద్యార్థులకు భారత అంతరిక్ష కార్యక్రమం, ఉపగ్రహ ప్రయోగాలు, సాంకేతికత, అంతరిక్ష పరిశోధనలో భౌతిక శాస్త్రం ప్రాధాన్యత తదితర అంశాలపై అవగాహన కల్పించారు. సతీష్ ధావన్ వంటి మహనీయుల కృషిని స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు పరిశోధన, నూతన ఆవిష్కరణల వైపు అడుగులు వేయాలని తెలిపారు.ఈ సందర్భంగా కళాశాల వైస్ ప్రిన్సిపాల్ సగిలి ప్రకాష్ రావు మాట్లాడుతూ, భారత అంతరిక్ష పరిశోధన రంగంలో డా. సతీష్ ధావన్ చేసిన విశిష్ట సేవలు దేశ యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారతదేశం సాధిస్తున్న పురోగతికి శాస్త్రవేత్తల కృషి ఎంతో కీలకమని పేర్కొన్నారు. విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకుని పరిశోధన మరియు నూతన ఆవిష్కరణలపై ఆసక్తి చూపాలని సూచించారు. భారత అంతరిక్ష రంగ భవిష్యత్తులో యువత కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో సీనియర్ అధ్యాపకులు డా. సులోచన, భౌతిక శాస్త్ర అధ్యాపకులు ఎస్. మధుబాబు, ఇతర అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.కళాశాలలో విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనా విధానం, పరిశోధనా ఆసక్తి మరియు నూతన ఆవిష్కరణల పట్ల అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
విద్యార్థులకు శాస్త్రీయ అవగాహన అవసరం” వైస్ ప్రిన్సిపల్ యస్ ప్రకాష్ రావు
RELATED ARTICLES

