విద్యార్థులకు శాస్త్రీయ అవగాహన అవసరం” వైస్ ప్రిన్సిపల్ యస్ ప్రకాష్ రావు

పోరుమామిళ్ల  సెప్టెంబర్లో 25 ప్రజావాణి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ  మాజీ ఛైర్మన్ డా. సతీష్ ధావన్ జయంతి సందర్భంగా విద్యార్థులకు శాస్త్రీయ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా భౌతిక శాస్త్ర విభాగం ఇన్‌చార్జి డా. కె.వెంకటరావు మాట్లాడుతూ, భారత అంతరిక్ష పరిశోధన రంగ అభివృద్ధిలో డా. సతీష్ ధావన్ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. భారతదేశంలో అంతరిక్ష పరిశోధనకు బలమైన పునాది వేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని...