బద్వేల్ సెప్టెంబర్ 25 ప్రజావాణి స్వర్ణ అనంతరాజుపురం:గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్రజల్లో తడి, పొడి చెత్త నిర్వహణపై పూర్తిస్థాయి అవగాహన కల్పించేందుకు స్వర్ణ అనంతరాజుపురం గ్రామపంచాయతీ ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. శుక్రవారం గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి, గౌరవ ఎంపీడీఓ శ్రీ ఎం. రమణారెడ్డి, పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీ S. విజయ్‌కుమార్ సంయుక్తంగా గ్రామంలో విస్తృత పర్యటన చేపట్టారు. స్వర్ణ అనంతరాజు పురం మరియు నక్కలగండి గ్రామాల్లోని ప్రతి ఇంటికీ స్వయంగా వెళ్లి, బిన్ బ్యాగ్’లను ఎలా ఉపయోగించాలనే అంశంపై ప్రజలకు ప్రత్యక్షంగా అవగాహన కల్పించారు.అనంతరం అధికారులు స్థానిక సంపద సృష్టి కేంద్రం ను సందర్శించారు. అక్కడ తడి చెత్త ద్వారా వర్మీ కంపోస్ట్ (వానపాముల ఎరువు) తయారు చేసే విధానాన్ని, ప్రక్రియను నిశితంగా పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.
దసరా కానుకల పోటీ: పీడీఓ కీలక ప్రకటన!
ఈ సందర్భంగా స్వర్ణ అనంతరాజుపురం పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ గ్రామ ప్రజలకు ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. ప్రతి కుటుంబం తమ ఇంట్లో రోజూ వచ్చే తడి, పొడి చెత్తను విడివిడిగా వేరు చేయాలని కోరారు. తడి చెత్తను రోజూ వచ్చే గ్రీన్ అంబాసిడర్లకు అందించాలనఅలాగే నెలలో రెండుసార్లు వచ్చే స్వచ్ఛ రథం’వాహనానికి పొడి చెత్తను విక్రయించి ఆదాయం పొందవచ్చని సూచించారు.ప్రజల్లో ఉత్సాహం నింపేందుకు పంచాయతీ అధికారులు ఒక ప్రత్యేక పోటీని ప్రకటించారు. ఇప్పటి నుంచి రాబోయే దసరా పండుగ వరకు ఏ కుటుంబం అయితే అత్యధిక కేజీల తడి చెత్తను లేదా పొడి చెత్తను వేరు చేసి గ్రీన్ అంబాసిడర్లకు,స్వచ్ఛ రథానికి అందిస్తారో.ఆ కుటుంబాలను గుర్తించి స్వర్ణ అనంతరాజుపురం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి, ప్రత్యేక బహుమతులను అందజేయనున్నారు.

