📄 ePaper
Epaper 2
Friday, September 25, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్కాశినాయనలో వైఎస్సార్‌సీపీలోకి భారీ చేరికలు..టీడీపీని వీడి 50 కుటుంబాల చేరిక

కాశినాయనలో వైఎస్సార్‌సీపీలోకి భారీ చేరికలు..టీడీపీని వీడి 50 కుటుంబాల చేరిక

📰 Generate e-Paper Clip

బద్వేల్ నియోజకవర్గం సెప్టెంబర్ 25ప్రజావాణి  కాశీనాయన మండలం వరికుంట్ల పంచాయతీలోని నాయనపల్లె గ్రామానికి చెందిన పారిశ్రామికవేత్త ఆర్.చంద్రయాదవ్ తో పాటు సుమారు 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.మాజీ జెడ్పిటిసి దేవసాని సత్యనారాయణ రెడ్డి,పార్టీ మండల అధ్యక్షులు హనుమంతు రెడ్డి,వెంకట్ రెడ్డి,ఓబుల్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి గార్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ,నియోజకవర్గ యువ నాయకుడు మరియు రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్య రెడ్డి నూతనంగా పార్టీలో చేరిన వారికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా పార్టీలో చేరిన ఆర్.చంద్రయాదవ్ మాట్లాడుతూ కాశీనాయన మండల ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు.ఎమ్మెల్సీ డి.సి. గోవిందరెడ్డి ఆధ్వర్యంలో పనిచేస్తూ,యువ నాయకుడు దేవసాని ఆదిత్య రెడ్డి సారథ్యంలో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. తనకు ఎలాంటి పదవులపై ఆశ లేదని,ప్రజలకు మంచి చేయాలనే సంకల్పంతోనే గోవిందరెడ్డి నాయకత్వాన్ని చూసి పార్టీలో చేరినట్లు తెలిపారు.గోవిందరెడ్డి ఇచ్చే సూచనలు, సలహాల మేరకు పార్టీ కోసం,ప్రజల కోసం నిరంతరం పనిచేస్తానని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డి.సి. గోవిందరెడ్డి ,ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ,దేవసాని ఆదిత్య రెడ్డి నూతనంగా పార్టీలో చేరిన కుటుంబాలకు ధైర్యం చెబుతూ, పార్టీ కుటుంబంలోకి సాదరంగా స్వాగతం పలికారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు,నూతనంగా పార్టీలో చేరిన కుటుంబాలు అందరూ కలిసికట్టుగా పనిచేసి కాశీనాయన మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను మరోసారి ఎగురవేసేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.బద్వేల్ నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసి, మన బద్వేల్ నియోజకవర్గం పేరు రాష్ట్రంలోనే ప్రతి ఒక్కరికీ తెలిసేలా సమష్టి కృషితో ముందుకు సాగాలని సూచించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మరియు జిల్లా అనుబంధ విభాగాల నాయకులు పంగా గురువిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి,పోరుమామిళ్ల మండల్ అబ్జర్వర్ ఓబుల్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి,మండల నాయకులు జయరాం రెడ్డి,చిన్న శంకరయ్య,కృష్ణారెడ్డి,వెంకటసుబ్బారెడ్డి,లక్ష్మిరెడ్డి, నరసింహారెడ్డి,దుగ్గిరెడ్డి,సత్యనారాయణరెడ్డి,తిరుపతిరెడ్డి, చెంచు ఓబుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.