దూలిమిట్ట రైతు వేదికలో ఘనంగా పోషణ మాసం వేడుకలు
మద్దూరు సెప్టెంబర్ 24,ప్రజా వాణి
పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా గురువారం చేర్యాల ప్రాజెక్ట్ పరిధిలోని బైరాన్ పల్లి సెక్టార్ స్థాయిలో పోషణ మాసం వేడుకలు దూల్మిట్ట రైతు వేదికలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బ్లాక్ కోఆర్డినేటర్ కనకరాజు ప్రారంభ ఉపన్యాసం చేస్తూ 9వ జాతీయ పోషణ మాసం ఉద్దేశాలను
1. ఆహార వైవిధ్యం
2. అంగన్వాడీలో తాజా వేడిగా వండిన భోజనం (హెచ్ సి ఏం)
3. సామాజిక యాజమాన్యం మద్దతు
4. బాల్యరంభ పోషణ మరియు ప్రేరణ
5. ప్రధానమంత్రి మాతృ వందన యోజన
గురించి వివరించారు.అలాగే మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ సమతుల్యమైన పోషకాహారాన్ని తీసుకోవాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచడం వల్ల రోగాల బారిన పడకుండా ఉంటారు.
ఈ సందర్భంగా సిడిపిఓ రమాదేవి మాట్లాడుతూ పోషణ మాసోత్సవాలు ప్రతి గ్రామంలో ప్రతి అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించడం జరుగుతుందని ప్రతి గర్భిణీ బాలింతలు తీసుకోవలసిన ఆహార వైవిధ్యాలు సమతుల్యమైన పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. అలాగే ప్రీస్కూల్ పిల్లలకు అంగన్వాడీ కేంద్రంలో అందిస్తున్న పోషణతో కూడినటువంటి ప్రీస్కూల్ విద్యను గురించి తల్లిదండ్రులకు గ్రామస్తులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి మోహన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటిస్తూ తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సమతుల్యమైన ఆహారం తీసుకోవాలని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండే విధంగా చూసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డి సి పి యు విభాగం సోషల్ వర్కర్ అనిత మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న బాల్య వివాహాలను గురించి గ్రామస్తులకు వివరించడం జరిగింది మరియు ఏ గ్రామంలో ఎక్కడ బాలవిహాలు జరిగినా చైల్డ్ లైన్ 1098కి సమాచారం ఇవ్వాలని అవగాహన కల్పించారు.ఇందులో భాగంగా ప్రతి గ్రామ స్థాయిలో బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లీలా జగన్ మోహన్ రెడ్డి వార్డు సభ్యులు గ్రామ పంచాయతీ కార్యదర్శి సిద్ధేశ్వర్,సూపర్వైజర్ రేణుక ,అంగన్వాడి టీచర్లు గర్భిణీ బాలింతలు గ్రామస్తులు పాల్గొన్నారు.

