📄 ePaper
Epaper 2
Wednesday, September 23, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJangaonజనగామలో ఘనంగా జల్సా- ఎ- సీరత్- ఉన్- నబీ సభ

జనగామలో ఘనంగా జల్సా- ఎ- సీరత్- ఉన్- నబీ సభ

📰 Generate e-Paper Clip

*జనగామలో ఘనంగా జల్సా- ఎ- సీరత్- ఉన్- నబీ సభ*

జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 20(ప్రజావాణి):
జమియతుల్ ఉలమా జనగామ జిల్లా ఆధ్వర్యంలో ఆదివారం జనగామలోని గాయత్రి గార్డెన్స్‌లో జల్సా-ఎ-సీరత్-ఉన్-నబీ, బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి జమియతుల్ ఉలమా జనగామ జిల్లా గౌరవ అధ్యక్షులు మౌలానా అబ్దుల్ హఫీజ్ ఖాస్మీ సాహెబ్ అధ్యక్షత వహించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ జమియతుల్ ఉలమా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హాఫిజ్ పీర్ ఖలీక్ అహ్మద్ సాబిర్ సాహెబ్, కరీంనగర్ జమియతుల్ ఉలమా అధ్యక్షులు ముఫ్తీ ముహమ్మద్ యూనస్ ఖాస్మీ సాహెబ్, వరంగల్ జమియతుల్ ఉలమా ప్రధాన కార్యదర్శి ముఫ్తీ జకరియా అహ్మద్ ఖాస్మీ సాహెబ్, హాఫిజ్ రిజ్వాన్ సాహెబ్ తదితరులు హాజరయ్యారు.

అలాగే జమియతుల్ ఉలమా జనగామ జిల్లా అధ్యక్షులు మౌలానా అబ్దుల్ రహ్మాన్ సబీలీ సాహెబ్, ఉపాధ్యక్షులు అడ్వకేట్ మహమ్మద్ జమాల్ షరీఫ్, ఖాజా ముజ్తాహిద్ ఉద్దీన్, మౌలానా షాకిర్ ఖాస్మీ సాహెబ్, మౌలానా ఫసీహుల్ ఇస్లాం సాహెబ్, మౌలానా అమానుల్లా సాహెబ్, మౌలానా రషీద్ సాహెబ్ తదితర ఉలమాలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉలమాలు మాట్లాడుతూ – ప్రవక్త మహమ్మద్ చూపిన సత్యమార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని, ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా, చెడు, తప్పుడు పనులకు దూరంగా ఉంటూ అందరితో మంచిగా మెలగాలని సూచించారు. ప్రతి ముస్లిం ఐదు పూటల నమాజును క్రమం తప్పకుండా ఆచరిస్తూ, ప్రవక్త జీవితం మరియు బోధనలను తెలుసుకొని వాటిని తమ జీవితాల్లో అమలు చేయాలన్నారు.
ప్రస్తుత కాలంలో యువత మరియు విద్యార్థుల్లో సీరత్ గురించి అవగాహన పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు.
అనంతరం జమియతుల్ ఉలమా జనగామ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇస్లామిక్ క్విజ్‌లో ప్రతిభ కనబరిచిన 270 మంది విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. విజేతలకు మొదటి బహుమతిగా రూ.5,000, రెండవ బహుమతిగా రూ.3,000, మూడవ బహుమతిగా రూ.2,000 చొప్పున అందజేశారు.
ఈ కార్యక్రమానికి ముస్లిం పెద్దలు, ఉలమాలు, విద్యార్థులు, మహిళలు, తల్లిదండ్రులు, యువత మరియు వివిధ వర్గాల ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.