మైబు. సుభాని దర్గా సందర్శించిన ఇనుగాల వెంకటరామిరెడ్డి.ఘనంగా సందళ్ పండుగ లో పాల్గొన్నారు
సెప్టెంబర్ 22.ప్రజావాణి న్యూస్/సంగెం
మైబు సుభాని దర్గా వద్ద ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో సందళ్ పండుగ లో పాల్గొన్న ఇనుగాల వెంకటరామిరెడ్డి.ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా దర్గాను ప్రత్యేకంగా అలంకరించి,ప్రార్థనలు నిర్వహించారు.పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేసి, దర్గాలో సందళ్ సమర్పించారు.పండుగ సందర్భంగా భక్తులు దర్గాను సందర్శించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు, మత పెద్దలు, యువకులు పాల్గొన్నారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ సదయ్య. ఉప సర్పంచ్ సంపత్. మార్కెట్ డైరెక్టర్ నాగరాజ్. గ్రామ ప్రజా ప్రతినిధులు వార్డ్ నెంబర్లు ముస్లిం సోదరులందరూ భక్తిశ్రద్ధలతో ప్రశాంతమైనవాతావరణంలో కొనసాగింది.
గ్రామంలో ఊరేగింపుతో దేవుని దర్గా దగ్గరికి వెళ్లి మొక్కులనుసమర్పించి అన్నదాన కార్యక్రమం ముస్లిం సోదరులందరూ కలిసి కార్యక్రమం నిర్వహించారు మసీదు కమిటీ దర్గా కమిటీ అందరూ పాల్గొని గ్రామంలో పెద్ద పండుగలా నిర్వహించిన ప్రజలందరూ ఉత్సాహంగా అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది

