📄 ePaper
Epaper 2
Wednesday, September 23, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణప్రమాదంలో కోల్పోయిన కుటుంబానికి బీమా భరోసా

ప్రమాదంలో కోల్పోయిన కుటుంబానికి బీమా భరోసా

📰 Generate e-Paper Clip

ప్రమాదంలో కోల్పోయిన కుటుంబానికి బీమా భరోసా

పెనుకుల కొమురయ్య కుటుంబానికి రూ.10.86 లక్షల బీమా ప్రయోజనం

ఓదెల, సెప్టెంబర్ 20:
ప్రమాదవశాత్తు కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబానికి బీమా సంస్థ ఆర్థిక భరోసాను అందించింది. ఓదెల మండలం నాంసంపల్లె గ్రామానికి చెందిన పెనుకుల కొమురయ్య 2022 సంవత్సరంలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో రూ.21,803 ప్రీమియంతో బీమా పాలసీ తీసుకున్నారు. ఈ పాలసీని ఓజ్జా శ్రీనివాస్, భిక్కు నాయక్‌ల ద్వారా పొందారు.

ఇటీవల పెనుకుల కొమురయ్య ప్రమాదవశాత్తు మృతి చెందడంతో, పాలసీ నిబంధనల ప్రకారం ప్రమాద బీమా క్లెయిమ్‌ను పరిష్కరించారు. ఇందులో భాగంగా ఆయన భార్య, నామినీ భాగ్యకు రూ.6,84,000 విలువైన బీమా క్లెయిమ్ చెక్కును శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఈడీ శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు.

అదేవిధంగా పాలసీ నిబంధనల ప్రకారం 134 నెలల పాటు నెలకు రూ.3,000 చొప్పున మొత్తం రూ.4,02,000 పెన్షన్ ప్రయోజనం కుటుంబానికి అందనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. దీంతో కుటుంబానికి మొత్తం రూ.10,86,000 మేర బీమా ప్రయోజనం లభించనుంది.
ఈ సందర్భంగా ఈడీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, అనుకోని ప్రమాదాలు, కుటుంబ పెద్దను కోల్పోయిన సందర్భాల్లో బీమా కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. భవిష్యత్తు ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ బీమా ప్రాధాన్యతను గుర్తించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఏజీఎం రాకేష్, డీఎం శివకుమార్, డీవోలు గుండేటి మధు, కర్రే కుమారస్వామి, ఓజ్జే శ్రీనివాస్, సుమలత, ఎండీ షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే సేల్స్ ఆఫీసర్లు రవీందర్ రెడ్డి, అనగంటి శ్రీనివాస్, అరవింద్, శ్రీనివాస్, వెంకటస్వామి, చిన్నస్వామి, పూర్ణచందర్, నర్సయ్య, రాజు, మూడోతుల శ్రీనివాస్, మూడోతుల సదయ్య, సూర్యనారాయణ, మల్లేశం, ఎగ్జిక్యూటివ్స్ మహేందర్, ప్రశాంత్, సాయి, హరీష్, మారుతి, శేఖర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

పెనుకుల కొమురయ్య కుటుంబానికి బీమా ప్రయోజనం అందడంతో కుటుంబ సభ్యులు సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.