📄 ePaper
Epaper 2
Wednesday, September 23, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణజన్ను యాకుబ్ కుటుంబాన్ని పరామర్శించిన టీఆర్పీ మైనారిటీ నాయకులు

జన్ను యాకుబ్ కుటుంబాన్ని పరామర్శించిన టీఆర్పీ మైనారిటీ నాయకులు

📰 Generate e-Paper Clip

*జన్ను యాకుబ్ కుటుంబాన్ని పరామర్శించిన టీఆర్పీ మైనారిటీ నాయకులు*

జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 20(ప్రజావాణి):
జనగామ మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) తరఫున 10వ వార్డు9 నుంచి పోటీ చేసిన జన్ను యాకుబ్ తల్లి ఆదివారం మృతి చెందిన విషయం తెలుసుకున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ మైనారిటీ నాయకులు వారి కుటుంబాన్ని పరామర్శించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి మహమ్మద్ అంజద్ పాషా , పట్టణ మైనారిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆరిఫ్ గారు, పట్టణ మైనారిటీ యూత్ అధ్యక్షులు రహీమ్ యాకుబ్ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, ఈ విషాద సమయంలో పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా కల్పించారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని వారు కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.