*జన్ను యాకుబ్ కుటుంబాన్ని పరామర్శించిన టీఆర్పీ మైనారిటీ నాయకులు*
జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 20(ప్రజావాణి):
జనగామ మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) తరఫున 10వ వార్డు9 నుంచి పోటీ చేసిన జన్ను యాకుబ్ తల్లి ఆదివారం మృతి చెందిన విషయం తెలుసుకున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ మైనారిటీ నాయకులు వారి కుటుంబాన్ని పరామర్శించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి మహమ్మద్ అంజద్ పాషా , పట్టణ మైనారిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆరిఫ్ గారు, పట్టణ మైనారిటీ యూత్ అధ్యక్షులు రహీమ్ యాకుబ్ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, ఈ విషాద సమయంలో పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా కల్పించారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని వారు కోరారు.