*శామీర్‌పేట్ చెరువు వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన*
*భక్తుల భద్రతే లక్ష్యం.. శామీర్‌పేట్ నిమజ్జన ప్రదేశంలో అధికారుల తనిఖీ*
*శామీర్‌పేట్ చెరువు వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన*
కీసర: శామీర్‌పేట్ చెరువు వద్ద వినాయక నిమజ్జనాల కోసం చేపడుతున్న ఏర్పాట్లను ఎంఎంసీ కమిషనర్ పి. వినయ్ కృష్ణారెడ్డి, మల్కాజిగిరి జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్ పరిశీలించారు. నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని సంబంధిత పోలీస్, హెల్త్ విభాగాల అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా శామీర్‌పేట్ చెరువు వద్ద ఏర్పాటు చేసిన మొబైల్ టాయిలెట్లను అధికారులు పరిశీలించారు. భక్తుల వినియోగానికి అందుబాటులో ఉండేలా వాటిని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని కీసర సర్కిల్ డిప్యూటీ కమిషనర్ జి. రామలింగంకు సూచించారు. నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా పారిశుధ్యం, తాగునీరు, వైద్య సదుపాయాలు, ట్రాఫిక్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కీసర సర్కిల్ ఈఈ లక్ష్మణ్, మెయింటెనెన్స్ డీఈ మాధవాచారి, ఎస్‌డబ్ల్యూఎం డీఈ సంతోష్, ఏఈ నిరీషాతో పాటు సర్కిల్ సిబ్బంది పాల్గొన్నారు.

