📄 ePaper
Epaper 2
Saturday, September 19, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డిలను మర్యాదపూర్వకంగా...

ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిసిన సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు జాయ మల్లేష్

📰 Generate e-Paper Clip

*ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిసిన సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు జాయ మల్లేష్*

జనగామ జిల్లా ప్రతినిధి , సెప్టెంబర్ 19(ప్రజావాణి):
జనగామ జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా అధ్యక్షులుగా నూతనంగా నియమితులైన జాయ మల్లేష్ శనివారం హైదరాబాద్ లోని ప్రజా భవన్ లో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డిని, అనంతరం జనగామ మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి , కొమ్మూరి ప్రతాప్ రెడ్డి లను శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో సేవాదళ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బిర్రు సత్యనారాయణ, డీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ నరేందర్ పవార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి లు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కోసం, పార్టీ సిద్ధాంతాలు ఆశయాల కోసం ప్రతి కార్యకర్త బాధ్యతతో పనిచేయాలని సూచించారు. సేవాదళ్ ను జిల్లావ్యాప్తంగా బలోపేతం చేయాలని, అందరినీ కలుపుకొని పార్టీ కోసం, పార్టీ గెలుపు కోసం నిరంతరం పనిచేయాలని సూచించారు.
అనంతరం జనగామ జిల్లా సేవాదళ్ అధ్యక్షులు జాయ మల్లేష్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఇంతటి బాధ్యతను అప్పగించిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కోసం నిబద్ధతతో, అంకితభావంతో పనిచేస్తానని, జనగామ జిల్లావ్యాప్తంగా సేవాదళ్ ను బలోపేతం చేస్తూ, పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ అందరినీ కలుపుకొని ముందుకు సాగుతానని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.