📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKhammamకరెంటు కోతలతో అల్లాడుతున్న జనాలు. .

కరెంటు కోతలతో అల్లాడుతున్న జనాలు. .

📰 Generate e-Paper Clip

కరెంటు కోతలతో అల్లాడుతున్న జనాలు.

ఒకవైపు సోలార్ పనులట.. మరోవైపు ట్రాన్స్ఫార్మర్లు..?

*గత కొన్ని కొంతకాలంగా ఇబ్బందులు పడుతున్న చెరువు మాదారం జనాలు…?

*మండల వ్యాప్తంగా కోతలపై బగ్గుమంటున్నా ప్రజలు…?

*అర్ధరాత్రి అయితే అంతే సంగతులు… స్థానికంగా ఉంటే కదా…?

నేలకొండపల్లి ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంతో పాటు చెరువు మాదారం సబ్స్టేషన్ పరిధిలో నిత్యం కరెంటు కోతలతో జనం ఇబ్బందులు పడుతున్నట్లు ఆరోపణలు విమర్శలు వినిపిస్తున్నాయి. సోలార్ ప్రాజెక్టు పనులు కింద వారానికి మూడు రోజులు కరెంటు కోతలను విధిస్తున్నట్లు సమాచారం. కొందరు అధికారులు మండల వ్యాప్తంగా విధులు నిర్వహించాల్సి ఉండగా స్థానికంగా నివాసం ఉండకపోవడంతో కరెంటు కోతలు విపరీతంగా పెరుగుతున్నట్లు ఆరోపణలువిమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. ప్రతి సంవత్సరం విద్యుత్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో పొలంబాట కార్యక్రమం ఇతర కార్యక్రమాలు ప్రతి ఏడాది సీజన్కు ముందు నిర్వహిస్తారు. అయినప్పటికీ సోలార్ వెలుగులు అంటూ స్తంభాలా ఏర్పాటు విద్యుత్ సబ్స్టేషన్లో రిపేర్లు అంటూ ఇలా వరుసగా కరెంటు కోతలు విధించడం పట్ల మండల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్న నేపథ్యం. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి కరెంటు కోతలు లేని విద్యుత్ను అందించాలని మండల ప్రజలు ఆయా సబ్ స్టేషన్ పరిధిలోని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.