*అంగన్వాడి కేంద్రాల్లో పోషణ మాసం వేడుకలు*
*రాయికల్, సెప్టెంబర్ 17 (ప్రజావాణి):*
రాయికల్ మండలంలోని తాట్లవాయి,మూటపల్లి, వడ్డెర కాలనీ గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలలో గురువారం జాతీయ పోషణ మాసం వేడుకలను ఘనంగా నిర్వహించారు.
*తాట్లవాయిలో శ్రీమంతం, అక్షరాభ్యాసం*
మండలంలోని తాట్లవాయి గ్రామ అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసంలో భాగంగా గర్భిణీ స్త్రీలకు,చిన్నారులకు పోషకాహారంపై అవగాహన కల్పించారు. అనంతరం గర్భిణీలకు శ్రీమంతం, చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ ఎం.అనూహ్య, ఉప సర్పంచ్ నారాయణ, వార్డు సభ్యులు పెద్దులు, సురేష్, హేమశ్రీ, పంచాయతీ కార్యదర్శి తిరుమల్,కారోబార్ మహిపాల్, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ప్రదీప్, కృష్ణవేణి, అంగన్వాడీ టీచర్లు సుజాత, చిట్టెమ్మ, విజయ, ఆశా కార్యకర్త లావణ్య, వీవోఏ వనిత, ఉపాధి హామీ మేట్ లావణ్య, గర్భిణీ స్త్రీలు, చిన్నారులు పాల్గొన్నారు.
*మూటపల్లిలో పోషకాహారంపై అవగాహన*
మండలంలోని ఇటిక్యాల సెక్టార్ పరిధిలోని మూటపల్లి గ్రామ అంగన్వాడీ కేంద్రంలో సెప్టెంబర్ నెలలో నిర్వహిస్తున్న పోషణ మాసం వేడుకల్లో భాగంగా అంగన్వాడీ టీచర్లు గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలు, ఎదిగే పిల్లలకు సమతుల్య ఆహారం, పోషకాహారం ప్రాముఖ్యత, రక్తహీనత నివారణపై అవగాహన కల్పించారు. ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారో వివరించారు. ఈ వేడుకల్లో అంగన్వాడీ టీచర్లు,హెల్పర్లు, గర్భిణీలు, బాలింతలు, పిల్లలు, తల్లులు, కిశోర బాలికలు తదితరులు పాల్గొన్నారు.
*వడ్డెర కాలనీలో అన్నప్రాసన*
మండలంలోని వడ్డెర కాలనీ గ్రామ అంగన్వాడీ కేంద్రంలో గురువారం నిర్వహించిన పోషణ మాసం వేడుకల్లో భాగంగా చిన్నారులకు సంప్రదాయబద్ధంగా అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించి అతిథుల చేత అన్నం తినిపించారు. అనంతరం చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బోదాసు రాజశేఖర్ మాట్లాడుతూ, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పిల్లల తల్లులకు పోషకాహార ప్రాధాన్యత, తల్లీబిడ్డల ఆరోగ్యం, రక్తహీనత నివారణ, సమతుల్య ఆహారం, పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే తాగించాలని, ఆ తర్వాత అనుబంధ ఆహారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అమీర్, అంగన్వాడీ టీచర్ బయ్యని సుజాత, ఆశా వర్కర్ సుమలత, గంగరాజు, సరూప, సంధ్య, గ్రామ మహిళలు, తల్లులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

