భక్తి.. సేవ.. అన్నదానం!
గణనాథుని సన్నిధిలో భజరంగ్ భక్త బృందం మహా కార్యక్రమం
కూకట్పల్లి, సెప్టెంబర్ 18 (తెలంగాణ గళం):
భజరంగ్ వినాయక భక్త బృందం సమక్షంలో, శ్రీ కురుమయ్య నవీన్ రావు ఆధ్వర్యంలో రేపు మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.
సెప్టెంబర్ 18, 2026 శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి హనుమాన్ దేవాలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు, కాలనీవాసులు, మిత్రులు కుటుంబ సమేతంగా హాజరై స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి గణనాథుని ఆశీస్సులు పొందాలని కోరారు.
అన్నదానం మహాదానం అనే స్ఫూర్తితో నిర్వహిస్తున్న ఈ సేవా కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

