అంగన్వాడి కేంద్రాల్లో పోషణ మాసం వేడుకలు

*అంగన్వాడి కేంద్రాల్లో పోషణ మాసం వేడుకలు* *రాయికల్, సెప్టెంబర్ 17 (ప్రజావాణి):* రాయికల్ మండలంలోని తాట్లవాయి,మూటపల్లి, వడ్డెర కాలనీ గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలలో గురువారం జాతీయ పోషణ మాసం వేడుకలను ఘనంగా నిర్వహించారు. *తాట్లవాయిలో శ్రీమంతం, అక్షరాభ్యాసం* మండలంలోని తాట్లవాయి గ్రామ అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసంలో భాగంగా గర్భిణీ స్త్రీలకు,చిన్నారులకు పోషకాహారంపై అవగాహన కల్పించారు. అనంతరం గర్భిణీలకు శ్రీమంతం, చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ ఎం.అనూహ్య, ఉప సర్పంచ్ నారాయణ, వార్డు సభ్యులు పెద్దులు, సురేష్, హేమశ్రీ,...