📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణWarangalచెన్నారావుపేట ఎమ్మార్వో ఆఫీస్‌లో ప్రజా పాలన వేడుకలు

చెన్నారావుపేట ఎమ్మార్వో ఆఫీస్‌లో ప్రజా పాలన వేడుకలు

📰 Generate e-Paper Clip

చెన్నారావుపేట ఎమ్మార్వో ఆఫీస్‌లో ప్రజా పాలన వేడుకలు

​చెన్నారావుపేట సెప్టెంబర్ 17 ప్రజావాణి

స్వేచ్ఛాయుత పాలన కోసం ప్రాణాలర్పించిన అమరుల త్యాగఫలమే నేటి ప్రజా పాలన అని తహసిల్దార్ మహమ్మద్ అలీ అన్నారు. ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం మండల రెవెన్యూ కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు.​ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, సుదీర్ఘ పోరాటాల వెనుక ఎంతోమంది మహనీయుల త్యాగాలు ఉన్నాయని స్మరించుకున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే ప్రభువులని, వారికి పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించడమే రెవెన్యూ శాఖ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు. సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు.​ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, రెవెన్యూ సిబ్బంది, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.